ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ గురువారం సాయంత్రం హైదరాబాద్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గ సమస్యలపై సీఎంకు వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన సీఎం తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.