కారేపల్లి: దసరా సందర్బంగా ఉసిరికాయలపల్లి కోటమైసమ్మ ఆలయం ప్రాంగణంలో ఐదురోజుల పాటు జాతర జరిగింది. జాతర సందర్బంగా ఆలయ ప్రాంగణం పాస్టిక్, వ్యర్ధాలు చెత్తతో నిండిపోయింది. దీంతో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర ప్రాంగణాన్ని శనివారం శుభ్రం చేశారు. ఆలయ ఇంచార్జీ పగడాల మోహన్‌కృష్ణ పర్యవేక్షణలో పారిశుధ్య పనులను చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు ఆలయం వద్ద వేయవద్దని ఆయన కోరారు.