మారుమూల, అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే ప్రధాన లక్ష్యంగా వైద్యలు, సిబ్బంది సమష్టిగా పని చేయాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ సైదులు అన్నారు. గురువారం కామేపల్లి మండలం మద్దులపల్లి గుట్టపై ఊటవాగు ప్రాంతంలో నివాసముంటున్న గొత్తికోయలకు కామేపల్లి పీహెచ్సీ ఆధ్వర్యాన చిన్నారులు, గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందించారు. గొత్తికోయలకు ఆరోగ్య పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.