కల్లూరులో షాదీఖానా నిర్మాణ పనులు యుద్ధప్రాతిపాదికన పూర్తి చేస్తామని కలెక్టర్ ముజమ్మిలాఖాన్ తెలిపారు. కల్లూరులో షాదీఖానా పనులను ఎమ్మెల్యే రాగమయితో కలిసి పరిశీలించిన ఆయన పనులు ఆగడానికి కారణాలు, స్థల వివాదంపై ఆరా తీశారు. నిధులు సరిపడా ఉన్నందున రెండు, మూడు నెలల్లో పూర్తి చేస్తామని, కబరస్తాన్ కు కూడా త్వరలో భూములు గుర్తిస్తామని తెలిపారు. ఆర్డీఓ ఎల్. రాజేంధర్, తహసీల్దార్ సాంబశివుడు, ఎంపీడీఓ ఉన్నారు.