శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన దేవి దుర్గామాత అమ్మవారిని శనివారం ఎమ్మెల్యే మట్టా రాగమయి దర్శించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు స్వయంగా వడ్డించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను ఎమ్మెల్యే స్థానిక ప్రజలకు వివరించారు.