పాలేరు జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టింది. గరిష్ఠ నీటిమట్టం 23 అడుగులకు గాను ప్రస్తుతం 16. 5 అడుగులకు తగ్గింది. మొదటి జోన్ నుంచి నీటి రాక తక్కువగాను, పాలేరు జలాశయం నుంచి రెండో జోన్ ఆయకట్టుకు నీటి విడుదల ఎక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి నెలకొంది. మొదటి జోన్ నుంచి 2827 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, పాలేరు నుంచి రెండో జోన్ కు 3812, పాత కాల్వకు 150 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది.