ముదిగొండ: గడ్డి మందు తాగి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
గడ్డి మందు తాగి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదిగొండ మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం. సువర్ణపురం గ్రామానికి చెందిన వేల్పుల భార్గవి (16) మండల కేంద్రంలోని హైస్కూల్లో పదో తరగతి చదువుతుంది. కాగా శుక్రవారం రాత్రి భార్గవి గడ్డి మందు తాగడంతో తల్లిదండ్రులు ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, శనివారం మృతి చెందింది. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.