నేలకొండపల్లి మండలం ఆనంతనగర్ లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, అధికారులు ఉన్నారు.