చింతకాని మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన సొసైటీ గోదాంను శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎంకు సొసైటీ పాలకవర్గం వెంకటేశ్వరస్వామి చిత్ర పటాన్ని బహూకరించారు. సొసైటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను రైతులకు అందజేయాలని, సహకార సంఘాల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రతి రైతూ సొసైటీలో సభ్యుడిగా చేరి ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు.