బోనకల్ మండలంలోని రావినూతలలో డబుల్ బెడ్రూం ఇంటి స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి. గ్రామానికి చెందిన రామకృష్ణకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని కేటాయించింది. కుటుంబీకులు శుక్రవారం తాళం వేసి కూలీ పనులకు వెళ్లగా స్లాబ్ పైపెచ్చులు కూలిపడ్డాయి. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. కాగా, ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వల్లే ఇలా జరిగినందున తమకు న్యాయం చేయాలని రామకృష్ణ కోరారు.