AP: గ్రూప్-1 అభ్యర్థులకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అండగా నిలిచారు. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1:100 నిష్ఫత్తి ప్రకారం అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరడంలో న్యాయం ఉందన్నారు. ఈ విషయంపై ఏపీపీఎస్సీ చైర్మన్‌కు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, అభ్యర్థులకు వెంటనే న్యాయం చేయాలని ఆమె కోరారు.