తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలలో రాష్ట్ర ప్రభుత్వం మెస్, కాస్మటిక్ ఛార్జీలు పెంచిన సందర్బంగా ముదిగొండ మండలంలో గురుకుల పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.