గీత కార్మికులకు ఉచితంగా మోపెడ్ వాహనాలు అందిస్తాం: మంత్రి పొన్నం

83பார்த்தது
గీత కార్మికులకు ఉచితంగా మోపెడ్ వాహనాలు అందిస్తాం: మంత్రి పొన్నం
గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్‌లో శనివారం కాటమయ్య రక్షక కవచాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025 మార్చి తర్వాత గీత కార్మికులకు ఉచితంగా మోపెడ్ వాహనాలు అందిస్తామని తెలిపారు. గీత కార్మికులకు సంబంధించి ఏమైనా పాత బకాయిలు ఉన్నట్లయితే వాటిని తక్షణమే విడుదలయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி