బైక్ ను ఓవర్ టేక్ చేసే క్రమాన లారీ తనకు తాకిందని వాగ్వాదానికి దిగిన వ్యక్తి పలుమార్లు వాహనాన్ని ఆపడం.. ఆపై లారీకి అడ్డుగా నిలబడ్డాడనే కోపంతో ఢీకొట్టగా మృత్యువాత పడ్డాడు. ఈనెల 12న రాత్రి జరిగిన ఈ ఘటనకు కారకులైన లారీ డ్రైవర్, క్లీనరు అరెస్ట్ చేసినట్లు మధిర సీఐడి మధు వెల్లడించారు. శుక్రవారం మధిర సర్కిల్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బైక్ పై వెళ్తున్న కొలికపోగు సోమయ్య(40)ను ఢీకొట్టడంతో మృతి చెందాడు.