దేశంలో పేరు మారకుండా, గుర్తు మారకుండా ఉన్న పార్టీ కేవలం సీపీఐ పార్టీనే అని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అన్నారు. ఆదివారం చింతకాని మండలం కోదుమూరులో సీపీఐ పార్టీ వంద సంవత్సరాల సభ్యత్వ కార్యక్రమాన్ని అయన ప్రారంభించి మాట్లాడారు. గత 100 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశామని, అందులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కోన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు సింగు నరసింహరావు ఉన్నారు.