HYD: అంబర్‌పేటలోని తులసీ రామ్‌నగర్‌కు BJP నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేసేందుకు పార్టీ ముఖ్య నేతలతో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 'మూసీపై బీజేపీ 4 నెలలుగా పోరాటం చేస్తోంది. ఇప్పటికే బాధితులతో మేం ధర్నా నిర్వహించాం. నేడు బాధితులతో కలిసి నిద్రపోతాం. సీఎం ప్రకటనలతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు' అని వ్యాఖ్యానించారు.