కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు రూ. 2225 మద్దతు ధర ప్రకటించినా, రాష్ట్ర ప్రభుత్వం మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని బీజేపీ మండలాధ్యక్షుడు కొండా గోపి ఆవేదన వ్యక్తం చేశారు. చింతకాని మండలం నాగలవంచ గ్రామంలో కల్లాల్లో ఎండబోసిన మొక్కజొన్నలను ఆదివారం ఆయన పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని కోరారు.