మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపు మేరకు ఎర్రుపాలెం మండలం నుంచి హైదరాబాద్ బయలుదేరిన మండల బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై వెంకటేష్ నేతృత్వంలో పోలీస్ సిబ్బంది ముందస్తు సమాచారంతో పార్టీ మండల అధ్యక్షుడు పంబి సాంబ శివరావు, సగ్గుర్తి కిషోర్ తో సహా పలువురు నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.