పెద్దపల్లి పట్టణ అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. మంగళవారం పెద్దపల్లిలోని 26, 27, 28 వార్డుల్లో టీయూఎఫ్ఐడిసి నిధులు ప్యాకేజీ- 2 ద్వారా రూ. 75లక్షలతో బిటి రోడ్డు, సిసి డ్రైనేజీ నిర్మాణం, 29, 31 వార్డుల్లో రూ. 52 లక్షలతో జెండా చౌరస్తా మున్సిపల్ ఆఫీస్ వరకు బిటి రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.