రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డిసిపి అడ్మిన్ రాజుతో కలిసి సమీకృత కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.