కాలువలో గుర్తుతెలియని శవం

67பார்த்தது
కాలువలో గుర్తుతెలియని శవం
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఆరెపల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలో బుధవారం శవం కొట్టుకొచ్చి ఆరేపల్లి శివారులో కాలువ ఒడ్డుకు చేరగా, గమనించిన చుట్టుపక్కల రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 30 ఏళ్ల వరకు వయసు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు కాల్వశ్రీరాంపూర్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி