ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి యునెస్కో వ్యవస్థాపక విద్యా సదస్సుకు ఎంపికయ్యారు. ఉజ్బేకిస్తాన్ దేశం తాష్కెంట్‌లోని అల్ఫ్రాగానస్ విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 10, 11న ఆసియా- పసిఫిక్ విద్యా సదస్సు జరుగనుంది. ప్రపంచంలోని వివిధ రంగాల్లో వేగంగా విస్తరిస్తున్న అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలు మెరుగుపరచడానికి వినూత్న ప్రోగ్రామ్‌ల రూపకల్పనలకు రెండు రోజుల సదస్సులో చర్చించనున్నారు.