గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించి ఫ్యామిలీ డిజిటల్ సర్వే పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసిల్దార్ సుమన్, ఎంపీడీవో సురేష్ ఉన్నారు.