జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 6 లక్షల 35వేల రూపాయల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచంద్రరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం నాయకులు నారపాక రమేష్ పాల్గొన్నారు.