10వ తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. పరీక్షల కోసం జగిత్యాల జిల్లాలో 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 11, 855 విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థులు ఉదయం 9: 30 నుండి 12: 30 గంటల వరకు పరీక్ష రాయనున్నారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లాలో పదవ తరగతి పరీక్షకు పటిష్ట ఏర్పట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు.