త్వరలోనే రజకుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎల్లారెడ్డి నూతన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. బుధవారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మున్సిపల్ చైర్మన్ ను రజక సంఘం సభ్యులు సత్కరించి, సమస్యల వినతి పత్రం అందించారు. పట్టణ రజక సంఘం గౌరవ అధ్యక్షులు దాకాయి పర్వయ్య, ఉపాధ్యక్షులు సత్యం, దాకాయి శేఖర్, ప్రధాన కార్యదర్శి సంఘమేశ్వర్, మహిళ కార్యదర్శి స్వరూప, సభ్యులు పాల్గొన్నారు.