ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్యెల్యే మదన్ మోహన్ చెప్పారు. ఎల్లారెడ్డి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నీటిపారుదల శాఖ అధికారులతో కాళేశ్వరం ప్యాకేజ్ 22 పనులపై ఎమ్యెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ ప్యాకేజి ద్వారా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని రైతులకు మేలు కలుగుతుందని అన్నారు.