బాన్సువాడ పట్టణంలోని వాసవి ప్రైవేటు పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా మండల విద్యాశాఖ అధికారి, పట్టణ ప్రముఖులు, విద్యార్థుల తల్లిదండ్రులు విచ్చేసి విద్యార్థులు తయారుచేసిన ఆహార పదార్థాలను రుచి చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చిన్నారులలో పౌష్టిక ఆహారం యొక్క ప్రాముఖ్యత తెలియజేయడానికి పాఠశాల యాజమాన్యం చేస్తున్న కృషిని వారు కొనియాడారు.