జగిత్యాల పట్టణంలో ఎస్ కే ఎన్ ఆర్ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం అమరవీరుల దినోత్సవం సందర్భంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలవేసి వారి త్యాగాలను స్మరించుకొని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండ సురేష్, ప్రధాన కార్యదర్శి సాగి శ్రీధర్ రావు, ఉపాధ్యక్షులు పిల్లి శ్రీనివాస్, కోశాధికారి ఎంబారి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.