జగిత్యాలలో పుణ్య క్షేత్రమైన పెంబట్ల-కోనాపూర్ శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుందని కార్యనిర్వహణాధికారి వడ్లూరి అనూష తెలిపారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి తరువాత వచ్చే సోమవారం రోజున ఏకాదశ రుద్రాభిషేకం జరపడం ఆనవాయితీగా వస్తోందని కార్యనిర్వహణాధికారి తెలిపారు.