సైబర్ నేరాలను అరికట్టేందుకు 5,000 మంది సైబర్ కమాండోలను సిద్ధం చేస్తున్న భారత్

71பார்த்தது
సైబర్ నేరాలను అరికట్టేందుకు 5,000 మంది సైబర్ కమాండోలను సిద్ధం చేస్తున్న భారత్
సైబర్ నేరాలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీసుల్ని సైబర్ కమాండోలుగా తీర్చదిద్దనున్నారు. వచ్చే ఐదేళ్లలో సుమారు 5,000 మందిని రంగంలోకి దించాలని కేంద్ర హోంశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ బాధ్యతను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్(ఐ4సీ)కి అప్పగించింది. ఈ క్రమంలోనే తొలి విడతగా 346 మందిని ఎంపిక చేసింది. ముందుగా రాష్ట్రాల పోలీసులతో పాటు కేంద్ర పోలీస్ సంస్థలు, కేంద్ర పారామిలిటరీ బలగాల నుంచి 2023 అక్టోబరు 5న నామినేషన్లను ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி