ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు మోకాలి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ‘మీ ఆరోగ్యం ఎలా ఉంది’ అంటూ ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. ‘నేను 110 ఏళ్లు బతుకుతానని కల వచ్చింది’ అని ఆయన బదులిచ్చారు. ఆయనకు ఇప్పుడు 89 ఏళ్లు. అమెరికాలో ఆపరేషన్ అనంతరం ఆయన ధర్మశాలలోని తన నివాసానికి చేరుకున్నారు.