అయ్యప్ప స్వాముల మహాపాదయాత్రను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ప్రారంభించినారు. శబరిమల వరకు సాగే పాదయాత్రను సికింద్రాబాద్ లోని స్టేషన్ రోడ్ లో గల గణేష్ దేవాలయం వద్ద జెండా ఊపి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించినారు. జంట నగరాలకు చెందిన 120 మంది అయ్యప్ప స్వాములతో కూడిన బృందం 1230 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహిస్తారన్నారు. నవంబర్ 27వ తేదీన శబరిమలకు అయ్యప్పలు చేరుకోనున్నట్లు తెలిపారు.