దేవి శరన్నవరాత్రులు సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యుత్ కాంతులతో ఆలయాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది ముస్తాబు చేశారు. ఆలయం లోపల వివిధ రకాల పూలతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అన్నపూర్ణ దేవిగా ఆదివారం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.