సికింద్రాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి తిరుమలగిరి నుంచి అల్వాల్ వరకు ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. దసరా పండుగ సందర్భంగా, ప్రధాన రహదారిపై, పండుగకి గ్రామానికి వెళ్లడానికి పలు బస్టాండులో మహిళలు, పిల్లలు, పెద్దలు బస్సులు ఆపడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీనికి తోడు ప్రధాన రహదారికి దుస్తుల దుకాణాలు ఉండటంతో వాహనాలు నిలవడంతో స్తంభించిపోయాయని పోలీస్ అధికారులు తెలిపారు.