బోయినపల్లి హస్మత్ పెట్ హిందూ శ్మశాన వాటికను కార్పొరేటర్ నరసింహా యాదవ్ మంగళవారం అధికారులతో కలిసి శ్మశాన వాటిక సందర్శించారు. శ్మశానవాటికలో పిచ్చి మొక్కలు తొలగించి సౌకర్యాలు కల్పించాలని అధికారులు కోరారు. దీపావళి నాడు హిందువులు శ్మశాన వాటికలో వారి పెద్దలకు పూజలు చేస్తారని ఈ నేపథ్యంలో వారికి అసౌకర్యం ఉండకుండా చూడాలని కోరారు. శ్మశానవాటికలో కాంతివంతమైన దీపాలను కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.