మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో గల గడి మైసమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రులు 8వ రోజులో భాగంగా గురువారం గడి మైసమ్మ తల్లిని శ్రీ దుర్గాదేవి అమ్మవారి రూపంలో అలంకరించారు. ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, దర్శనం చేసుకోవడానికి మాలదారులు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వెళ్తున్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మవారిని భక్తులు శ్రద్ధలతో కొలుస్తున్నారు.