విజయదశమి సందర్భంగా రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి శుభాకాంక్షలతో బిఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే దౌర్జన్యంగా తొలగిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు శనివారం ఆరోపణ చేసారు. పోలీసు బందోబస్తు నడుమ, మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్ ను అడ్డుపెట్టుకొని బలవంతంగా తమ ఫ్లెక్సీలను తొలగించారని మండిపడ్డారు.