సఫిల్‌గూడ చెరువులోకి మురిగునీరు వదులుతున్న వారితో మాట్లాడి సేవరేజ్ డైవర్షన్ పనులు చేపట్టాలని వాటర్ వర్క్స్, జిహెచ్ఎంసి అధికారులను సోమవారం మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ డిమాండ్ చేశారు. మురికి నీరు చెరువులోకి చేరడంతో గుర్రపుడెక్క ఎంత తీసిన
మళ్లీ వస్తోందన్నారు. స్పందించిన జోనల్ కమీషనర్ రవికిరణ్, డీఈ మహేష్ పూర్తిస్థాయిలో గుర్రపుడెక్క శుభ్రం చేయిస్తామని అన్నారు.