కూకట్పల్లిలో భర్త తల పగలగొట్టిన భార్య
వీపు రుద్దమన్నందుకు భర్త తల పగలగొట్టిన ఘటన కెపిహెచ్బిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు ప్రకారం.. శివయ్య, రజిత దంపతులకు ఇద్దరు పిల్లలు. గతంలో దీనిపై పిఎస్ లో కేసు నమోదైంది. శుక్రవారం శివయ్య స్నానం చేస్తూ వీపు రుద్దమని భార్య మీద అరిచాడు. ఇరుగు పొరుగు వారు వింటారని ఆమె ఘాటుగా బధులివ్వడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఓ రాడ్తో శివయ్య తల మీద కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.