నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. తాజాగా వీరికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమైంది. ఇటీవల కళ్యాణ్ రామ్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కూతురు, కొడుకుతో కలసి వెళ్తుండగా.. మీడియా కంటపడ్డారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన పిల్లలను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిల్లలు సినీ ఈవెంట్స్, ఎయిర్ పోర్టుల్లో కనిపిస్తుంటారు.