సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే

77பார்த்தது
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే
హైడ్రా విషయంలో ముందు అఖిల పక్షం సమావేశం నిర్వహించాలని ఇటీవల తాను కోరానని, సీఎం స్పందించి మీటింగ్ పెడతామని నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. హైడ్రా పేరుతో 3 నెలల నుంచి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారని, ఇదే అఖిల పక్షం సమావేశం 3 నెలల ముందే పెట్టి ఉంటే కూకట్‌పల్లిలో బుచ్చమ్మ చనిపోయేది కాదన్నారు.

தொடர்புடைய செய்தி