కూకట్ పల్లి నియోజకవర్గం బాలనగర్ డివిజన్ ఇంద్ర నగర్ లో నల్ల పోచమ్మ దేవాలయం పునర్నిర్మాణానికి కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. డివిజన్ అధ్యక్షుడు మధు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అమ్మవారి దయతో ఆలయ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి కావాలని బండి రమేష్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.