కూకట్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అల్లాపూర్ డివిజన్ ప్రజల సమస్యల పైన స్థానిక కార్పొరేటర్ సబిహ గౌసుద్దిన్ ఆధ్వర్యంలో శుక్రవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో రోడ్లు డ్రైనేజీ మంచినీటి సమస్యలు ఉన్నాయని అదేవిధంగా హైడ్రా పేరుతో రాజీవ్ గాంధీ నగర్, సఫ్దార్ నగర్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు విన్నవించుకున్నారు.