హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద సేవ్ యూనివర్సిటీ ల్యాండ్స్ పేరుతో విద్యార్థులు, ఏబీవీపీ నేతలు సోమవారం సాయంత్రం మరోసారి నిరసన చేపట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. కొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులు శాంతియుత నిరసన హక్కు హరించారని ఆరోపించారు.