
కార్వాన్: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న కార్పొరేటర్లు
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఎంఐఎం కార్పొరేటర్లు శుక్రవారం దర్శించుకున్నారు. కార్వాన్ డివిజన్ కార్పొరేటర్ స్వామి యాదవ్, పురాణాపూల్ డివిజన్ కార్పొరేటర్ సున్నం రాజమోహన్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్పొరేటర్ల వెంట కార్యకర్తలు ఉన్నారు.