ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని పాతనగరంలో ఐటీ టవర్ నిర్మించాలన్న ఆలోచనలతో గత కేసీఆర్ ప్రభుత్వం మలక్‌పేటలో ఐటీ టవర్ నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించి, నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. అలాంటి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.