తెలంగాణ లో మార్చి 21వ తేదీ నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వాహణ కోసం విద్యాశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో 2,650 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నరం 12.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.