వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై సోమవారం హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. సవరణపై సమావేశం జరిగే సమయంలో ఓవైసీ మౌనం పాటించారని, ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. “సవరణ ఖచ్చితంగా జరుగుతుందని, ఎవరు వచ్చినా ఆగదని” రాజా సింగ్ హెచ్చరించారు.