సున్నితమైన పాతబస్తీలో బాలాపూర్ గణేశుడి శోభయాత్రను పోలీసులు ప్రణాళిక బద్ధంగా ముందుకు తీసుకెళ్లారు. బాలాపూర్ లో ఉదయం 11: 30 కు ప్రారంభమైన శోభాయాత్ర గుర్రం చెరువు కట్టపైకి రాగానే హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్వాగతం పలికి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బార్కాస్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, లాల్ దర్వాజా మోడ్, చార్మినార్, మదీనా మీదుగా పాతబస్తీని దాటించారు.